ఈనెల 28న సీబీఐ లో సిబిఓ పరీక్ష


 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్ (సీబీఓ) ఉద్యోగాల భర్తీకి ఈనెల 28 న పరీక్షలు నిర్వహించనున్నది. అధికారిక నోటీసు ప్రకారం, అభ్యర్థులు టెస్ట్ సెంటర్ల యొక్క మూడు ఎంపికలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ లింక్ ఎస్‌బీఐ "కెరీర్" వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నది. ఈ వెబ్‌సైట్లు నవంబర్ 10 నుంచి 16 వరకు యాక్టీవ్‌గా ఉంటాయి. దరఖాస్తుదారు యొక్క దరఖాస్తు / అర్హతలను ధ్రువీకరించకుండా ఆన్‌లైన్ పరీక్షలో ప్రవేశం పూర్తిగా తాత్కాలికంగా ఉంటుంది. దరఖాస్తుదారు అభ్యర్థిత్వం ఇంటర్వ్యూ / చేరిన సమయంలో వివరాలు / అర్హతా పత్రాల ధ్రువీకరణకు లోబడి ఉంటుంది. రాత పరీక్షలో 250 మార్కులు (పార్ట్ ఏ + పార్ట్ బీ) ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు 30 నిమిషాలు. పరీక్ష ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో ఉండి తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు మార్కుల్లో కోత ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్‌లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేస్తారు. రాష్ట్రంవారీగా, వర్గంవారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 3 రెట్లు అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి గరిష్ట మార్కులు 100. అభ్యర్థి తుది ఎంపిక కోసం పరిగణించబడటానికి ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ సీబీఓ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు దాఖలు ప్రక్రియ జూలై 27 న ప్రారంభమై.. ఆగస్టు 16 వరకు కొనసాగింది. ఈ నియామక ప్రక్రియలో 3,850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక