306 కు చేరిన joe biden ఎలక్టోరల్ ఓట్లు


 

వాషింగ్జన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎలక్టోరల్ ఓట్లు మరింత పెరిగాయి. జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల్లో విజయం సాధించడంతో ఆయన స్కోరు 306కు చేరింది. ఎన్నికల రేసులో వెనుకబడిపోయిన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 232 వద్దే నిలిచిపోయారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండగా ఇప్పటికే 48 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. చివరగా మిగిలిన జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల్లో కూడా ఫలితాలు వెలువడ్డాయి. ఆరిజోనాలో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, జార్జియాలో 16 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బైడెన్ విజయం సాధించడంతో ఆయన ఆధిక్యం 306కు చేరింది. ఇక జార్జియాలో మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ తర్వాత విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థిగా బైడెన్ రికార్డుల్లో నిలిచారు. 1992లో జరిగిన అధ్యక్ష ఎన్నిలకల్లో చివరిసారిగా క్లింటన్ గెలుపొందారు.