31 శాతం చిన్నారుల పైనే లైంగిక దాడులు


 

న్యూఢిల్లీ : గత ఏడాది దేశరాజధాని ఢిల్లీలో జరిగిన మొత్తం 3,137 లైంగికదాడి కేసుల్లో 31శాతం మంది చిన్నారులే. స్వచ్ఛంద సంస్థ ప్రజా ఫౌండేషన్‌ ఈ మేరకు శుక్రవారం నివేదికను విడుదల చేసింది. గత ఐదేండ్లతో పోలిస్తే నేరాల నమోదు సంఖ్య స్వల్పంగా తగ్గినట్టు పేర్కొంది. లైంగికదాడుల కేసుల నమోదు సంఖ్య ఒక శాతం, హత్య కేసుల సంఖ్య తొమ్మిది శాతం తగ్గింది. గత ఏడాది నమోదైన 3,137 లైంగికదాడి కేసులో 969 లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదయ్యాయి. 16 నుంచి 18 ఏండ్ల వయసుగల లైంగికదాడి బాధితులు 425 మంది ఉన్నట్టు నివేదిక పేర్కొంది. మైనర్లపై జరిగిన లైంగికదాడుల్లో 96 శాతం కేసుల్లో నేరస్థులు బాధితురాలికి తెలిసిన వారేనని తెలిపింది. ఇక దొంగతనాల విషయానికి వస్తే.. 2019లో 2.37 లక్షల కేసులు నమోదయ్యాయి. 2015 నుంచి పోలిస్తే 166శాతం పెరిగాయి.