ఇండస్ట్రీకి వచ్చి 41 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు

 
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 41 సంవత్సరాలు అవుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #MaheshBabu@41Years అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మహేశ్ వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు అంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ అది నిజం.41 ఏళ్ల క్రితం దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘నీడ’ చిత్రంలో తొలిసారి నటించాడు మహేష్ బాబు. ఇప్పటి వరకు 35 సినిమాల్లో యాక్ట్ చేసిన మహేష్ అందులో హీరోగా 26 సినిమాల్లో నటిస్తే.. బాల నటుడిగా 9 చిత్రాల్లో మెప్పించారు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ స్టార్‌డమ్ సృష్టించుకున్నాడు మహేశ్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమా ద్వారా తొలిసారి పూర్తిస్థాయిలో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా మహేశ్‌కు మంచి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. తదుపరి గుణశేఖర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఒక్కడు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తదనంతరం మహేశ్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. అతడు, పోకిరి, బిజినెస్ మాన్, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, స్పైడర్ వంటి సినిమాలతో వరుసగా హిట్లు సాధించాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. అయితే వంశీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నమ్రతా శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మంచి మనసున్న మహేశ్ సేవా కార్యక్రమాలు కూడా చేపడతాడు. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి.. ఫారెన్ నుంచి డాక్టర్స్‌ను పిలిపించి చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తాడు. మహేశ్‌కు ఇద్దరు పిల్లలు కొడుకు గౌతమ్, కూతరు సితార. మహేష్ పద్మాలయా బ్యానర్‌‌తో పాటు, విజయ కృష్ణ, కృష్ణ ప్రొడక్షన్స్, ఇందిరా ప్రొడక్షన్స్, మహేష్ బాబు తన పేరుతో నెలకొల్పిన జి.మహేష్ బాబు ప్రొడక్షన్స్ హౌస్ సంస్థలను నిర్వహిస్తున్నాడు.