వాట్సాప్ లో అద్భుతమైన 5 సరికొత్త ఫీచర్లు


 

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలి కాలంలో యూజర్లకు ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిల్లో వాట్సాప్ పే కూడా ఒకటి. కేవలం భారత్‌లోని యూజర్లకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే త్వరలో మరో 5 అద్భుతమైన ఫీచర్లను కూడా వాట్సాప్ తన యూజర్లకు అందివ్వనుంది. ఆ ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. రీడ్ లేటర్ వాట్సాప్‌లో ఉన్న ఆర్కైవ్డ్ చాట్ ఫీచర్‌నే రీడ్ లేటర్‌గా మార్చి అందుబాటులోకి తేనున్నారు. దీంతో వెకేషన్ మోడ్‌లాగే ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఎంపిక చేసిన కాంటాక్ట్ నుంచి యూజర్లకు ఎలాంటి మెసేజ్‌లు, కాల్స్ రావు. ఇక దీన్ని కావాలనుకున్నప్పుడు డిజేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫీచర్ ఆన్‌లో ఉంటే.. ఎంపిక చేసిన కాంటాక్ట్‌కు చెందిన వారు మెసేజ్ లు పంపినా యూజర్లకు నోటిఫికేషన్లు రావు.2. మ్యూట్ వీడియోస్ వాట్సాప్‌లో పంపుకునే వీడియోలను ముందుగానే మ్యూట్ చేసుకునే సదుపాయాన్ని కూడా త్వరలో అందివ్వనున్నారు. దీన్ని వాట్సాప్ ప్రస్తుతం పరీక్షిస్తోంది. 3. రిపోర్ట్ టు వాట్సాప్ ఫేస్‌బుక్‌లో యూజర్లు పెట్టే పోస్టులపై ఫేస్‌బుక్ కు రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అదే ఫీచర్‌ను వాట్సాప్‌లో అందివ్వనున్నారు. దీంతో యూజర్లు తమకు వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లపై వాట్సాప్‌కు రిపోర్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో సదరు మెసేజ్‌లను పంపే యూజర్లపై వాట్సాప్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల స్పాం మెసేజ్‌లకు, మోసపూరిత ప్రకటనలకు అడ్డుకట్ట వేయవచ్చు. 4. మల్టీ డివైస్ సపోర్ట్ వాట్సాప్ నిజానికి ఈ ఫీచర్‌ను ఎప్పటినుంచో పరీక్షిస్తోంది. ఒక యూజర్ ప్రస్తుతం తన వాట్సాప్ అకౌంట్‌ను ఒకే డివైస్‌లో వాడుకునే వీలుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎన్ని డివైస్‌లలో అయినా వాడుకోవచ్చు. దీని గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అతి త్వరలోనే ఈ ఫీచర్ కూడా యూజర్లకు లభిస్తుందని తెలిసింది. 5. అడ్వాన్స్‌డ్ వాల్‌పేపర్ వాట్సాప్ లో యూజర్లు ఏదైనా వాల్ పేపర్‌ను సెట్ చేసుకుంటే అది అన్ని కాంటాక్ట్‌లకు కనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఒక్కో కాంటాక్ట్‌కు ఒక్కో వాల్ పేపర్‌ను సెట్ చేసుకునే విధంగా త్వరలో వాట్సాప్ ఒక ఫీచర్‌ను అందిస్తుందని తెలిసింది.