5జి ఫోన్ తిసికురబోతున్న ఒప్పో


 

ఒప్పో కంపెనీ 20000 రూపాయల లోపే 5జీ మొబైల్ ను తీసుకుని రావాలని అనుకుంటూ ఉంది. Oppo K7x (ఒప్పో K7x) మొబైల్ చైనాలో అధికారికంగా లాంఛ్ అయింది. ఈ కె-సిరీస్ మొబైల్ లో 90hz స్క్రీన్ కూడా ఉంది. అలాగే పాళీ కార్బోనేట్ బాడీ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ కూడా ఉంది. ఈ ప్రాసెసర్ 5జీని సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే చైనాలో 5జీ అందుబాటులోకి రావడంతో ఈ మొబైల్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేశారు. ఒప్పో K7x మొబైల్ ఫోన్ రియల్ మీ X7 కు పోటీ అని చెబుతూ ఉన్నారు. అందుబాటు ధరలో 5జీ సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ గా మార్కెట్ లోకి ఈ మొబైల్ విడుదలైంది. ఒప్పో K7x ధర వివరాలు: ఒప్పో K7x చైనాలో 1499CNY ధరకు అందుబాటులోకి రానుంది. భారత కరెన్సీలో 16700 రూపాయలుగా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి బ్లాక్ మిర్రర్, బ్లూ షాడో రంగుల్లో ఈ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంది. నవంబర్ 11 నుండి చైనాలోని రీటైలర్స్ కు అందుబాటులో ఉంది. ఒప్పో K7x ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న విషయాన్ని ఇంకా ఒప్పో సంస్థ చెప్పలేదు. ఒప్పో K7x ప్రత్యేకతలు: ఒప్పో K7x మొబైల్ లో డ్యూయల్ సిమ్ కార్డ్స్ తో రానుంది. 5జీ నెట్వర్క్ రెండు స్లాట్స్ లోనూ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 10 బేస్డ్ కలర్ ఓ.ఎస్. 7.2 తో పని చేయనుంది. 6.5 ఇంచ్ 1080పి ఎల్.సి.డి. స్క్రీన్ తో అది కూడా 90hz రీఫ్రెష్ రేట్ తో రానుంది. 90.5 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో రానుంది. పంచ్ హోల్ కెమెరా 16 మెగా పిక్సెల్ గా చెబుతూ ఉన్నారు. వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. 48 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా కలదు. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. 5G, Bluetooth, Wi-Fi, 3.5mm హెడ్ ఫోన్ జాక్, USB-C పోర్ట్ సదుపాయం ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 30w ఛార్జింగ్ సదుపాయం కూడా కలదు. మొబైల్ బరువు 194 గ్రాములుగా చెబుతున్నారు.