5 లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం


 

వాషింగ్టన్‌: వలసదారులకు బైడెన్‌ తీపికబురు అందిచనున్నట్లు తెలుస్తున్నది. దాదాపు 1.10 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం ఇచ్చేలా ప్రణాళికను రూపొందించనున్నట్టు బైడెన్‌ ప్రచార బృందం విడుదల చేసిన డాక్యుమెంట్‌ పేర్కొంది. వీరిలో 5 లక్షల మంది భారతీయులే ఉండనున్నట్టు వెల్లడించింది. కొంత మంది వలసదారులకు అమెరికా పౌరసత్వం లభించినప్పటికీ వారి సంతానానికి పౌరసత్వం లేకపోవడంతో తల్లిదండ్రులు ఒకచోట, పిల్లలు మరో చోట ఉంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా తమ వలస విధానం ఉంటుందని డాక్యుమెంట్‌ పేర్కొంది.