ప్రతిభను వెలికి తీత ఈ నెల 7న టాలెంట్. స్కాలర్ షిప్ టెస్ట్

 


 యువతలో ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 7వ తేదీన రాష్ట్రస్థాయి టాలెంట్‌ సెర్చ్‌/స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ను నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ గైడెన్స్‌ బ్యూరో, మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ డిప్యూటీ చీఫ్‌ రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఏకేఎస్‌ ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ఈ టెస్ట్‌ను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు, సివిల్స్‌, యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ టెస్ట్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన 10 మంది అభ్యర్థులకు ఏకేఎస్‌ ఐఏఎస్‌ అకాడమీలో 100శాతం ఉచితంగా యూపీఎస్సీ, సివిల్స్‌ కోచింగ్‌, మిగతా 90 మంది అభ్యర్థులకు రాయితీనిస్తామన్నారు. వివరాలకు టి. రఘుపతిని 82476 56356 నెంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.