షియోమి కూడా తన యొక్క రెడ్‌మి నోట్ 9 5G సిరీస్ విడుదల ...!

 


స్మార్ట్‌ఫోన్ సంస్థలు అన్ని ఇటీవల కాలంలో 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి కూడా తన యొక్క రెడ్‌మి నోట్ 9 5G సిరీస్ ను నవంబర్ 24 2020న విడుదల చేయనున్నది. ఆన్‌లైన్ టిప్‌స్టర్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ కొత్త సిరీస్‌లో రెండు కొత్త 5G ఫోన్లను విడుదల చేయనున్నాయి. ఇటీవల ఈ కొత్త సిరీస్‌లోని ఒకదానిని సింగపూర్ యొక్క IMDA ధృవీకరణలో మోడల్ నెంబర్ M2007J22Gగా గుర్తించబడింది. ఇది ప్రపంచం మొత్తం మీద లాంచ్ చేసే సూచనలు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. రెడ్‌మి నోట్ 9 5G సిరీస్ గ్లోబల్ లాంచ్ షియోమి సంస్థ IMDA ధృవీకరణలో సూచించిన M2007J22G మోడల్ నెంబర్ కంటే ముందే 'C' ప్రిఫిక్స్ ను ఉపయోగిస్తుంది. ఇది చైనాలో ప్రారంభించబడుతుందని సూచిస్తుంది. ఇతర ప్రిఫిక్స్ 'G' ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడుతుంది. ముకుల్ శర్మ తెలిపిన M2007J22G మోడల్ నంబర్ చివర 'G' ప్రిఫిక్స్ను కలిగి ఉంది. అంటే ఈ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడుతుంది. ఇంకా దీని గ్లోబల్ రిలీజ్ కోసం రెడ్‌మి నోట్ 10 5G అని పేరును కూడా సంస్థ ప్రకటించింది. రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 5G కనెక్టివిటీ ఫీచర్స్ ఇప్పటి వరకు విడుదల అయిన సమాచారం ప్రకారం రెడ్‌మి నోట్ 10 ఫోన్ 5G మరియు NFC కనెక్టివిటీ రెండింటిని కలిగి ఉంటుంది. దీనికి తోడుగా 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అయితే గిజ్మోచినా నివేదిక ప్రకారం చైనాలో కొత్త రెడ్‌మి నోట్ 9 సిరీస్ మూడు మోడళ్లతో విడుదల కానుంది. మూడు మోడళ్లలో రెండు 5G వేరియంట్లు మరియు ఒకటి 4G ఉండడం గమనార్హం. ఈ సిరీస్ యొక్క 4G వేరియంట్‌ను షియోమి భారతదేశం వంటి అంతర్జాతీయ మార్కెట్లకు అందుబాటులోకి తెస్తుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 9 5G ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు ఆన్‌లైన్ లీక్‌ల ప్రకారం కొత్త రెడ్‌మి నోట్ 9 సిరీస్ యొక్క హై-ఎండ్ మోడల్ రెడ్‌మి నోట్ 9 5G ప్రో స్మార్ట్‌ఫోన్ 108MP రియర్ కెమెరాను కలిగి ఉండి ISOCELL HM2 SoC ను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే రెడ్‌మి సిరీస్ ఫోన్లలో ఇంత శక్తివంతమైన లెన్స్‌ను కలిగి ఉండటం ఇదే మొదటిసారి అవుతుంది. లో-ఎండ్ రెడ్‌మి నోట్ 5G ఫోన్ 6.53-అంగుళాల FHD+ హోల్-పంచ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే హై-ఎండ్ మోడల్ 6.67-అంగుళాల FHD+ ఎల్‌సిడి హోల్-పంచ్ డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 9 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధరల వివరాలు రెడ్‌మి నోట్ 9 5G స్మార్ట్‌ఫోన్ యొక్క లో-ఎండ్ వేరియంట్ యొక్క ధర RMB1,000. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.11,200. అలాగే కొత్తగా లాంచ్ అవుతున్న సిరీస్ యొక్క హై-ఎండ్ వేరియంట్ యొక్క ధర RMB1,500. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.16,800 వద్ద ఉండవచ్చు అని భావిస్తున్నారు.