రెడ్మీ నోట్ 9 5gగా విడుదల


 

షియోమి సబ్ బ్రాండ్ Redmi నుండి కొత్త స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో M2007J22C మరియు M2007J17C అనే రెండు పరికరాలు ఉండవచ్చు. రెడ్మి నోట్ 10 సిరీస్ లో రెండు పరికరాలు వస్తాయని మొదట్లో నమ్మకం ఉండేది. అయితే, ఈ M2007J22C మరియు M2007J17C రెండు కూడా Redmi Note 9 యొక్క కొత్త వేరియంట్లుగా ఉంటాయని ఇప్పుడు తెలుస్తోంది మరియు వీటిని 5G మద్దతుతో అందించవచ్చు. M2007J22C రెడ్మి నోట్ 9 5G గా విడుదల చేయగా, M2007J17C రెడ్మి నోట్ 9 ప్రో 5 జిగా లాంచ్ అవ్వవచ్చు. ఎందుకంటే, ఈ రెండు ఫోన్ల స్పెక్స్ షీట్ ఇప్పుడు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. రెడ్మి నోట్ 9 5 జి TEENA లో కనిపించింది మరియు స్పెక్స్ కూడా బయటకు వస్తున్నాయి.