నవంబర్ 9న ఉప్పెన నుండి కొత్త పాట రిలీజ్


 

సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'ఉప్పెన'. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు 'నీ కన్ను నీలి సముద్రం' పాట 140 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేయగా, 'ధక్‌ ధక్‌ ధక్‌' సాంగ్‌ 25 మిలియన్స్‌ వ్యూస్‌ను దాటింది. తాజాగా ఈ చిత్రంలోని 'రంగులద్దుకున్న' అనే పాటను హీరో మహేష్‌బాబు చేతుల మీదుగా నవంబరు 11వ తేదీన విడుదల చేయనున్నారు. 'ప్రేమ అనే మహాసముద్రంలోకి దూకేందుకు రెడీ అవ్వండి. నవంబరు 11 నుంచి మీ ఫేవరేట్‌ సాంగ్స్‌ ప్లేలిస్ట్‌లో 'రంగులద్దుకున్న పాట వుంటుంది. థాంక్యూ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు' అంటూ మైత్రీ మూవీమేకర్స్‌ అధినేతలు తమ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఓ కీలకపాత్ర చేస్తున్న 'ఉప్పెన' చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. థియేటర్లు పున:ప్రారంభం కాగానే చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: అనిల్‌.వై, అశోక్‌.బి, సీ.ఇ.వో: చెర్రీ, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని,వై.రవిశంకర్‌, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: బుచ్చిబాబు సానా .