ఆకాశంలో అద్భుతం కనబడ్డ బ్లూమూన్


 

శనివారం రాత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బ్లూమూన్‌ దర్శనమిచ్చింది. ఒకే నెలలో రెండోసారి కనిపించే సంపూర్ణ చంద్రుడిని బ్లూమూన్‌ అని పిలుస్తారు. ఇప్పటికే అక్టోబరు 1న సంపూర్ణ చంద్రుడు కనిపించగా, తాజాగా మళ్లీ కనువిందు చేశాడు.