ఆల్ సెట్.. ‘ఆచార్య’కు షూటింగ్ కి రెడి అవుతున్న మెగాస్టార్

 

ఆల్ సెట్.. ‘ఆచార్య’కు

అన్ని క్లియరెన్స్‌లు వచ్చేస్తున్నాయి. ఇన్నాళ్లు.. ఒక సినిమా వంద ప్రశ్నలు అన్నట్టుగా ఉంది ఈ మెగా మూవీ పరిస్థితి. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్‌ చూస్తే అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లుగానే కనిపిస్తున్నాయి. ‘అన్నయ్య’ చిరంజీవి కరోనా అనంతరం తొలిసారి కెమెరా ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఆయన ‘ఆహా’ ఓటీటీలో సమంత వ్యాఖ్యాత చేస్తోన్న ‘సామ్ జామ్’ షోలో పాల్గొన్నారు. ఇటీవల కరోనా విషయంలో చిరు టెన్షన్ పడ్డారు. మొదట ఆయనకు కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. లక్షణాలు లేకపోవడంతో రెండు రోజుల్లో మళ్లీ టెస్టు చేసుకోగా..నెగిటివ్ వచ్చిందని..మొదట చేసిన టెస్ట్ ఫలితం తప్పుగా వచ్చిందని చిరు చెప్పారు. దీంతో ఈ నెల 20 నుంచి కెమెరా ముందుకు వచ్చేస్తున్నారు మెగాస్టార్. అసలు వస్తారో లేదో అనుకున్న కాజల్‌ కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో డేట్స్ ఇచ్చేసింది నీహరిక పెళ్లి కోసం చిరు బ్రేక్ తీసుకున్నా.. ఆ టైంలో కాజల్ సీన్స్‌ కవర్‌ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు కొరటాల. ఇప్పటికే చిరు రిక్వెస్ట్‌కు ఓకే చెప్పిన రాజమౌళి కూడా… ఎప్పుడంటే అప్పుడు చెర్రీని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. నిహారిక పెళ్లి పనులు పూర్తయ్యాక చిరు, చరణ్ కాంబో సీన్స్‌ కూడా కానిచ్చేసేలా స్కెచ్‌ వేస్తున్నారు. ఇలా వరుస గుడ్ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్‌ కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారట!