రైట్స్ లో ఇంజనీర్ పోస్టులు ఖాళీ


 

న్యూఢిల్లీ: రైల్వే శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ అయిన రైట్స్ (ఆర్ఐటీఈఎస్‌)లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 170 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. మొత్తం పోస్టులు: 170 ఇందులో సివిల్ ఇంజినీర్‌- 50, ఎలక్ట్రికల్ ఇంజినీర్‌-30, మెకానికల్ ఇంజినీర్‌-90 పోస్టుల చొప్పున ఉన్నాయి. అర్హత: బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. రెండేండ్ల అనుభవం తప్పనిసరి. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష (60 శాతం), ఇంటర్వ్యూ (35 శాతం), అనుభవం (5 శాతం) ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300 దరఖాస్తులకు చెవరితేదీ: నవంబర్ 26