భారత్ అమెరికా మధ్య కీలక ఒప్పందం


 

భారత్ అమెరికా సహకారం అనేది ప్రపంచానికి కూడా చాలా కీలకంగా చెప్తూ ఉంటారు. రాజకీయంగా రెండు దేశాల మధ్య ఏ విధమైన పరిస్థితి ఉన్నా సరే ఇప్పుడు చాలా వరకు కూడా రెండు దేశాల మధ్య వాణిజ్యం లో అలాగే ఉద్యోగంలో చాలా వరకు కీలక ఒప్పందాలు జరగాల్సిన అవసరం అనేది ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో చాలా వరకు కూడా భిన్నమైన పరిస్థితులు మనం చూస్తూ ఉండే వాళ్ళం. ఆయన అనుసరిస్తున్న వైఖరి చాలా మందికి ఇబ్బందిగా ఉండేది అనే మాట నిజం. ఆయన చాలా వరకు కూడా వివాదాలను పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండే వారు. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మన దేశం నుంచి అమెరికా వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక వ్యాపారం విషయంలో అమెరికా కంపెనీలు కూడా మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తు ఉంటాయి. కాబట్టి ఉద్యోగాల విషయంలో, భారత్ లో అమెరికా కంపెనీల వ్యాపారం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా రెండు దేశాలు అడుగులు వేసే అవకాశం ఉంది అని సమాచారం. రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. నిబంధనలను కాస్త సులభతరం చేసే విధంగా రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా వైద్య రంగం విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. అయితే ఇప్పుడు అమెరికా... మన దేశం విషయంలో కాస్త కఠినం గా ఉండే అవకాశం ఉంది అని కూడా కొందరు అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.