భారతీయ అమెరికన్‌ మహిళకు కీలక బాధ్యతలు

 


‌ వాషింగ్టన్‌/మంగళూరు: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ భారతీయ అమెరికన్‌ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ(47)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధ విషయాల్లో కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు మాలా సహకరిస్తారు. ప్రస్తుతం ఆమె బైడెన్‌ 2020 ప్రచార కార్యక్రమానికి సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా, బైడెన్‌కు సీనియర్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.
మాలా గతంలో బైడెన్‌ ఫౌండేషన్‌కు హయ్యర్‌ ఎడ్యుకేషన్, మిలటరీ ఫ్యామిలీస్‌ విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు, ఒబామా హయాంలో ఎడ్యుకేషనల్, కల్చరల్‌ బ్యూరోలో డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫర్‌ స్టేట్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు.అప్పగించారు. కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ(47)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధ విషయాల్లో కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు మాలా సహకరిస్తారు. ప్రస్తుతం ఆమె బైడెన్‌ 2020 ప్రచార కార్యక్రమానికి సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా, బైడెన్‌కు సీనియర్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మాలా గతంలో బైడెన్‌ ఫౌండేషన్‌కు హయ్యర్‌ ఎడ్యుకేషన్, మిలటరీ ఫ్యామిలీస్‌ విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు, ఒబామా హయాంలో ఎడ్యుకేషనల్, కల్చరల్‌ బ్యూరోలో డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫర్‌ స్టేట్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు.