మళ్లీ మర్యాదరామన్న కాంబినేషన్

 


రాజమౌళి దర్శకత్వంలో సునీల్‌, సలోని జంటగా తెరకెక్కిన చిత్రం మర్యాద రామన్న. 2010లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టింది. చిత్రంలో సునీల్ చాలా అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని అందించాడు. సలోని కూడా తన పాత్రతో మెప్పించాడు. అయితే ఇప్పుడు సునీల్‌, సలోని కాంబినేషన్‌లో దర్శకుడు వీఎన్ ఆదిత్య ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడట. దీనిని అనీల్ సుంకర నిర్మించనున్నట్టు తెలుస్తుండగా, ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని చెబుతున్నారు. కమెడీయన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు మళ్లీ కమెడీయన్‌గా చేస్తున్నాడు.