గ్యాస్ సిలిండర్ లో కొత్త రూల్స్ నేటి నుంచి అమలు


 

Gas Cylinder Customers Alert: వినియోగదారులకు అలెర్ట్. వంట గ్యాస్‌కు సంబంధించి నేటి నుంచి కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల డెలివరీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుడి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీతో కూడిన మెసేజ్ వస్తుంది. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌కి.. వినియోగదారుడు ఆ ఓటీపీ నెంబర్‌ను చూపించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతీ గ్యాస్ కనెక్షన్‌దారుడు తప్పనిసరిగా తమ ఫోన్ నెంబర్‌ను గ్యాస్ ఏజెన్సీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. అలా లేనిపక్షంలో డెలివరీ సాధ్యపడదని స్పష్టం చేసింది. గ్యాస్ బండను బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా ఉండేందుకు ఆయిల్ కంపెనీలు ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చాయి. ఇక ఇండేన్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకోవాలంటే.. ఇక నుంచి 7718955555 నెంబర్‌కు కాల్ చేయాలి. కాగా, ఈ నెల గ్యాస్ సిలిండర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. వినియోగదారులకు ఊరటను ఇస్తూ ఆయిల్ కంపెనీలు ఈ నెల గ్యాస్ సిలిండర్ల రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. తాజాగా ఇండేన్ నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మెట్రో నగరాల్లో ఇలా ఉన్నాయి. ఢిల్లీలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర - రూ.594 ముంబైలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర - రూ.594 చెన్నైలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర - రూ.610 కోల్‌కతాలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర - రూ.620.50