గుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి ఎంతో మంచిది


 

Eat Egg Yellow :రోజుకి ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే మనలో చాలామంది పచ్చ సొన తీసేసి తెల్ల సొన తింటూ ఉంటారు పచ్చ సొన తినవచ్చా లేదా తినకూడదా అనే విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మనలో చాలామంది పచ్చ సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని తినడం మానేస్తుంటారు. ఇలా పచ్చసొన తినటం మానేసి తెల్ల సొన మాత్రమే తింటే గుడ్డులో ఉన్న పోషకాలు పూర్తిగా మన శరీరానికి అందవు సగం పోషకాలు మాత్రమే అందుతాయి. ఎందుకంటే గుడ్డు పచ్చసొనలో కూడా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ అది రక్తంలో కొవ్వును పెంచ దని నిపుణులు చెబుతున్నారు. కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ ఎముకలను బలంగా ఉంచే విటమిన్ కె చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఈ రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్-డి గుడ్డు పచ్చదనం సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా ఎదిగే పిల్లలు గర్భిణీలు గుడ్డు పచ్చసొన తీసుకోవాలి అప్పుడే అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.