గ్లామర్ నుంచి కొత్త సిరీస్ సరికొత్త టెక్నాలజీ తో విడుదల చేయనున్న హీరో


 

హీరో మోటోకార్ప్‌ మరో కొత్తబైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైక్‌లలో విజయవంతమైన మోడల్‌గా పేరు తెచ్చుకున్న గ్లామర్‌ సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. గ్లామర్‌ బ్లేజ్‌ పేరుతో వస్తోన్న ఈ కొత్త మోడల్‌ను హీరో సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్‌ షోరూమ్‌లలో గ్లామర్‌ బ్లేజ్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.72,200 (ఎక్స్‌-షో రూమ్‌). కొత్త వాహనాన్ని హ్యాండిల్‌బార్‌కు యూఎస్‌బీ చార్జర్‌ ఆప్షన్‌ కూడా ఉంది. ఈ కొత్త మోడల్‌ ప్రస్తుతం గ్రే కలర్‌లో లభిస్తుంది. కాగా, దేశ వ్యాప్తంగా మంచి పేరున్న గ్లామర్‌ మోడల్‌ బైక్‌లు సంస్థ బ్రాండ్‌ విలువను, పనితీరును చూచిస్తాయని హీరో మోటోకార్ప్‌ సేల్స్‌ అండ్‌ ఆఫ్టర్‌సేల్స్‌ హెడ్‌ నవీన్‌ చౌహాన్‌ తెలిపారు.