యూట్యూబ్లో ఆర్ఆర్ ఆర్ రికార్డు దుమ్మురేపుతున్న రామరాజు టీజర్


 

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం RRR. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన 'భీమ్‌ ఫర్‌ రామరాజు' టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకుంది. మొత్తం 5 భాషలలో రిలీజ్ అయిన ఈ టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతో అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా 'భీమ్‌ ఫర్‌ రామరాజు' టీజర్ రికార్డు నెలకొల్పింది.