త్వరలో మరిన్ని చైనా ఆప్స్ ను నిషేదించ బోతున్న భారత్ఈ సంవత్సరం జూన్ 29 మొదలుకొని ఇప్పటి వరకు అనేక దశలు గా వివిధ రకాల చైనా అప్లికేషన్లను నిషేధించిన భారత ప్రభుత్వం తాజాగా మరోమారు మరికొన్ని చైనా అప్లికేషన్లను నిషేధించే సన్నాహాలు చేస్తోంది. దీనికోసం Android యూజర్లు ఉపయోగించే Google Play Store, Apple Apple Storeలలో ఎక్కువ మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకుంటున్న చైనా అప్లికేషన్లను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఐదు రోజుల క్రితం నవంబర్ 24న భారత ప్రభుత్వం 43 చైనా అప్లికేషన్లను ఇండియాలో నిషేధించింది. వీటిలో బాగా ప్రముఖంగా వాడబడే ఆలీబాబా వర్క్ బెంచ్, CamCard వంటి అప్లికేషన్స్ కూడా ఉండడం గమనార్హం. భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని 69A సెక్షన్ కింద భారతీయ వినియోగదారుల డేటాను విదేశాలలో దుర్వినియోగం చేస్తున్నారు అన్న కారణాలను చూపిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.