రేపు ఉన్నత అధికారులతో కేసీఆర్ సమావేశం

 


తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు శనివారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఇన్ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కరోనా ప్రభావంతో నష్టపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్ర అర్థిక పరిస్థితిని అధిగమించేందుకు తీసుకోవల్సిన అంశాలను అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. అనంతరం 2020- 2021 బడ్జెట్‌పై ముఖ్యమంత్రి మధ్యంతర సమీక్ష జరపనున్నారు. అలాగే, శరవేగంగా కొనసాగుతున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై కూడా సీఎం కేసీఆర్‌ సమీక్ష జరుపనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు సమాచారం.