మన్ కీ బాత్ లో వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ

 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్​ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మన్​ కీ బాత్​ 71వ ఎడిషన్​లో తన మనసులోని విషయాలను ప్రజలతో పంచుకోనున్నారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్​ టీకాల పనితీరు, పురోగతిని పరిశీలించేందుకు శనివారం అహ్మదాబాద్​, పుణె, హైదరాబాద్​లోని ఫార్మా సంస్థలను సందర్శించారు మోదీ. శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటి అభివృద్ది సహా ఇతర వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి మనసులో మాట కార్యక్రమంలో వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.