ఇళ్ల నిర్మాణంపై తప్పుడు సమాచారం ఇస్తే తక్షణమే కఠిన చర్యలు


 

ఇళ్ల నిర్మాణ తక్షణ అనుమతులపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ హెచ్చరిక మూడేళ్ల జైలు, కూల్చివేతలు లేదా ఆస్తి జప్తు చేయాలని అధికారులకు ఆదేశం సాక్షి,హైదరాబాద్ : ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తక్షణ రిజిస్ట్రేషన్‌/అనుమతి చేసుకునే దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ హెచ్చరించారు. తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై టీఎస్‌-బీపాస్‌ చట్టంలోని సెక్షన్‌ 10 కింద మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా, కూల్చివేతలు లేదా ఆస్తి జప్తు చేసుకోవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అరవింద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.