బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రోడ్‌ షో

 


గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రోడ్‌ షోలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కేపీహెచ్‌బీ కాలనీ నుంచి రాజాసింగ్‌ రోడ్‌ షో మొదలుపెట్టారు. బాలాజీ నగర్‌ డివిజన్‌లో రోడ్‌షో కొనసాగుతున్న సమయంలో అదే దారిలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నేతలు వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా ఇరు పార్టీల కార్యకర్తలు గట్టిగా పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం దద్దరలిల్లింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలను వెనక్కి వెళ్లిపోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడం సరికాదని పలువురు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. రెండు పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించేయడంతో గొడవ సర్ధుమణిగింది.