దీపావళి వేడుకలకు అయోధ్య ముస్తాబైంది.


 

దీపావళి వేడుకలకు అయోధ్య ముస్తాబైంది. ఇప్పటికే అయోధ్యలోని అన్ని ప్రధాన రహాదారులను ప్రత్యేకంగా అలంకరించారు. అయోధ్యలోని వందలాది దేవాలయాలను విద్యుత్ వెలుగులతో అలంకరించారు. ఇప్పటికే సరయూ నది తీరంలో దీపోత్సవానికి సంబంధించి రిహార్సల్స్ నిర్వహించారు. దివ్య దీపోత్సవంలో భాగంగా రామ్ కీ పైడీలో 5.5 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నారు. ఇవాళ జరిగే దీపావళి వేడుకల్లో గవర్నర్ రామ్ నాయక్, సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొంటారు. అరణ్యవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగివచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారని అయోధ్యవాసులు నమ్ముతారు.