జి.హెచ్.ఎం.సి ఎన్నికల్లో జనసేన-బీజేపీ పొత్తుపై స్పష్టత ,,,,?

 

జి.హెచ్.ఎం.సి ఎన్నికల్లో జనసేన-బీజేపీ పొత్తుపై స్పష్టత రావడం లేదు.

ఎన్నికలలో కలసి పోటీచేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని నేడు బీజేపీ అగ్ర నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని జనసేన అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఆసక్తి నెలకుంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి మాత్రం భిన్నమైన ప్రకటన వచ్చింది. పొత్తు లేదని క్లియర్‌గా చెప్పిన సంజయ్..తాను పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడం లేదని స్పష్టత ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ఇప్పటికే ఖరారయ్యింది అని, తమ దగ్గరకు జనసేన ఎలాంటి ప్రతిపాదన తేలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ మీద తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల క్యాడర్‌లో తీవ్ర కన్‌ఫ్యూజన్ నెలకుంది. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కలసి పోటీచేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని జనసేన, భారతీయ జనతా పార్టీలు నిర్ణయించాయి. ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బి. జె.పి. తెలంగాణ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు, ఆ పార్టీ అగ్ర నేతలు కలవనున్నారు.