నాగ్ అశ్విన్ కు షాక్ ఇచ్చిన ప్రభాస్


 

రాధే శ్యామ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. ఆ సినిమా తర్వాత, ఆదిపురుష్ తెరకేక్కుతుందని భావించారు. అయితే, నిన్న ఆదిపురుష్ విడుదల తేదీని ప్రకటించడంతో, ప్రభాస్ నాగ్ అశ్విన్‌ సినిమా 2023 వరకు వేచి చూడాలని అధికారికంగా ధృవీకరించబడింది. రాధే శ్యామ్ షూట్ పూర్తి కాగానే ప్రభాస్ ఆదిపురుష్ సెట్స్‌లోకి వెళ్తాడు. రాధే శ్యామ్ సమ్మర్ 2021 కి విడుదల కానుంది. నిజానికి నాగ్ అశ్విన్ - ప్రభాస్ సినిమా కంటే ముందే ఆదిపురుష్ విడుదల చేస్తారని గతంలోనే బలమైన పుకార్లు వచ్చాయి, కానీ అధికారిక ధృవీకరణ లేదు. నిన్నటితో దానికి క్లారిటీ ఇచ్చేశారు. ఇక నాగ్ అశ్విన్ ప్రభాస్ నిర్ణయంతో సంతోషంగా లేడని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ తన సినిమా ముందు చేసి దానినే మొదట విడుదల చేస్తానని అశ్విన్ కు హామీ ఇచ్చాడట. కానీ ఆ హామీని తప్పి టాలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు ప్రభాస్ తన బాలీవుడ్ అరంగేట్రం పరిపూర్ణంగా ఉండేలా చూసుకుంటున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు కూడా మొదలయ్యాయని అంటున్నారు. ఇక ఈ సినిమాని వైజయంతి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అశ్వినీ దత్ నిర్మిస్తోన్న ఈ సినిమలో హీరోయిన్ గా దీపికా పడుకొనే నటిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు మొదలుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో దేవుడికే తెలియాలి మరి. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో మొదలయింది.