నవంబర్ దాటిన తర్వాతే స్కూల్ రీ ఓపెన్ ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం


 

Schools Reopen New Date: తెలుగు రాష్ట్రాలతోపాటూ... దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. అందువల్ల ఇప్పటికే చాలా వరకూ సడలింపులు ఇచ్చేసినా... స్కూల్స్ ఎప్పుడు తెరవాలనే అంశం అన్ని రాష్ట్రాలకూ ప్రశ్నగానే ఉంది. కొన్ని రాష్ట్రాలు... ఫలానా తేదీ నుంచి తెరుస్తామని ప్రకటించాయి కూడా... ఐతే... అన్‌లాక్ 5 మార్గదర్శకాలు... మరో నెలపాటూ అంటే... నవంబర్‌లోనూ కొనసాగుతాయన్న కేంద్రం... స్కూళ్లు ఎప్పుడు తెరవాలనే అంశంపై క్లారిటీ ఇస్తూ మరో ఆర్డర్ జారీ చేసింది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదు. కేంద్ర అధికారులు మరో సంవత్సరం పడుతుందని అంటున్నారు. అందువల్లే స్కూల్స్ తెరిచే విషయంలో కేంద్రం లోతుగా ఆలోచిస్తోంది. కొత్త ఆదేశాన్ని కేంద్ర హోంశాఖ జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 10 (2)(1)లో అధికారాలను ఉపయోగించుకుంటూ... ఈ ఆదేశం జారీ చేసింది. దీని ప్రకారం... నవంబర్ 30 వరకూ స్కూళ్లు తెరవడానికి వీల్లేదు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశం. నిజానికి రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూళ్లు తెరుద్దామన్నా... తమ పిల్లల్ని పంపడానికి దాదాపు 80 శాతం మంది తల్లిదండ్రులు ఆసక్తిగా లేరు. ఎందుకంటే... కరోనా సోకదని గ్యారెంటీ ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల్ని ఇళ్లలోనే ఉంచుకొని చదివించుకుంటాం తప్ప... స్కూలుకు పంపే ప్రసక్తే లేదంటున్నారు. వైరస్‌కి వ్యాక్సిన్ వేసేంతవరకూ అదే కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. అటు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తల్లిదండ్రులను ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది. అందువల్లే ఇప్పుడు ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. ఇండియాలో కొత్తగా 36,470 మాత్రమే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 79,46,429కి చేరింది. దేశంలో కొత్తగా 488 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,19,502కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతం ఉండగా... ప్రపంచ దేశాల్లో అది 2.66 శాతంగా ఉంది. తాజాగా 63,842 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,01,070కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 6,25,857 ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 837 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,32,671 కి చేరింది. కొత్తగా నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,315కి చేరింది. కొత్తగా 1,554 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,13,466కి చేరింది. ప్రస్తుతం 17,890 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,851 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 74,757 టెస్టులు చెయ్యగా.... 2,901 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. కొత్తగా 19 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 6,625కి చేరింది. తాజాగా 4,352 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా... ప్రస్తుతం 27,300 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76,96,653 టెస్టులు చేశారు. Dailyhunt