వివో కంపెనీ అదిరిపోయే ఫీచర్స్ సరికొత్త ఫోన్


 

దీపావళి కి అన్నీ వస్తువుల మీద భారీ ఆఫర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే.. ఎలెక్ట్రిక్ విద్యుత్తు వస్తువుల పై , డిజిటల్ వస్తువుల పై ఆఫర్లు మాములుగా ఉండవు.. రోజుకో కంపెనీ ధరలను దగ్గిస్తూ వస్తుంది..ఇక మొబైల్ ఫోన్ విషయం లో అయితే చెప్పనక్క్లేదు.. నిమిషానికి ఒక కంపెనీ ఆఫర్ వెలుగులోకి వస్తుంది.. తాజాగా వివో కంపెనీ అదిరిపోయే ఫీచర్స్ తో మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఆ ఫోన్ కు డిమాండ్ అనేది మాములుగా లేదు.. మరి ఫోన్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వివో వీ20 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ కొత్త కలర్ వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఆక్వామెరైన్ గ్రీన్ రంగులో కూడా ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. కేవలం రంగు తప్ప ధరలో కానీ, స్పెసిఫికేషన్లలో కానీ, ఫీచర్లలో కానీ ఈ రెండు ఫోన్లలో ఎటువంటి మార్పులూ లేవు. ఇందులో ఆక్టా-కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను అందించారు.. ముఖ్యంగా సెల్ఫీలు తీసుకొనే వారికి ఈ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది.. ఎందుకంటే ఇందులో 32 మెగాపిక్సెల్‌గా ఉంది. వివో ఇండియా ఈ-స్టోర్, ఈ-కామర్స్ వెబ్ సైట్లు, దేశంలోని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. గ్రావిటీ బ్లాక్, ఆక్వామెరైన్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటు లో ఉంది.. అయితే సరికొత్త ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.20,999 మాత్రమే..కొన్ని కంపెనీల డెబిట్ , క్రెడిట్ కార్డులను వాడితే తగ్గింపు ధరలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ బొకే సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను ముందువైపు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4100 ఎంఏహెచ్ గా ఉంది.. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.. ఇక ఫోన్ బరువు విషయానికొస్తే..171 గ్రాములు ఉంది.