వివిధ దేశాల అధ్యక్షులతో ప్రధాని మోడీ సమావేశం.......?

 


కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు భారత్ కచ్చితంగా ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ విషయంలో దూకుడుగా ఉన్నా సరే తయారి విషయంలో వెనుకబడి ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పాలి. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ కి ఎక్కువగా ఇప్పుడు వ్యాక్సిన్ అనేది చాలా అవసరం అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కరోనా కట్టడిలో వైద్య రంగం ఫెయిల్ అయింది. మన దేశంలో రెండో వేవ్ తీవ్రత ఎక్కువగా వస్తే మాత్రం కరోనాను కట్టడి చేయడం అనేది దాదాపుగా సాధ్యం అయ్యే పని కాదు. కాబట్టి వ్యాక్సిన్ అనేది మన దేశానికి చాలా కీలకం. అందుకే వ్యాక్సిన్ ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి మన దేశం లండన్ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇప్పుడు రష్యా మన దేశ సహకారం తీసుకుంటుంది. రష్యా వ్యాక్సిన్ల విషయంలో ఇప్పుడు మన ఫార్మా కంపెనీలు కూడా దూకుడుగా ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ మన దేశంలో ఎక్కువగా తయారు చేసినా దాని నిల్వ అనేది చాలా కీలకం. ఇందుకోసం పరికరాల అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా ఇతర దేశాల నుంచి పరికరాలను దిగుమతి చేసుకోవాలని చూస్తుంది. చాలా తక్కువ ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ ని నిల్వ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి బ్రిటన్, క్యూబా దేశాల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయా దేశాల అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి మన దేశంలో అదుపులోనే ఉంది.