ప్రభాస్ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనవాస్


 

ప్రభాస్‌, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రాల్లో ఛత్రపతి ఒకటి. ఈ సినిమా ఎంతటి సెన్సేషనల్‌ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారట.ఈ రీమేక్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటిస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్‌తో బాలీవుడ్‌లో ఛత్రపతి సినిమాను రీమేక్‌ చేయనుందట. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'అల్లుడు అదుర్స్‌' చిత్రంలో నటిస్తున్నాడు.