సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న చిరంజీవి రామ్ చరణ్ దీపావళి ఫోటో

 

వస్తున్న సినీ ప్రముఖులంతా.. అంతే జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షించింది. దీపావళిని పురస్కరించుకుని చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.బ్యాగ్రౌండ్ లో తారాజువ్వలు ఆకాశంలో వెలుగుతుండగా.. చిరు - చరణ్ ఇద్దరూ సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు. ఇందులో చిరు తనయుడు చరణ్ భుజంపై చేయివేసి కనిపిస్తున్నాడు. ట్రెడిషనల్ దుస్తుల్లో ఉన్న తండ్రీకొడుకుల నవ్వు ముఖాలు దీపావళి కాంతుల్లో

వెలిగిపోతున్నాయి. చాలా రోజుల తరువాత ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఈ ఫొటోను చూస్తూ మురిసిపోతున్నారు. ఇటీవల మెగాస్టార్ కరోనా బారిన పడ్డారని వెళ్లడించిన సంగతి తెలిసిందే. అయితే మూడు రోజులు గడిచినా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మరోసారి పరీక్షలు చేయించుకున్నానని నెగిటివ్ గా తేలిందని స్పష్టం చేశారు. దీంతో అప్పటి వరకు చిరు కి కరోనా సోకిందని కలవరపడిన మెగా అభిమానులంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తండ్రీకొడుకులు సెల్ఫీ తీసుకొని ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్ అందించారు. ఇప్పుడు ఈ మెగా సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.