ప్లేఆఫ్ రేసులో కు చేరువైనా కోల్కతా. సీజన్ నుండి వెళ్లిపోయిన రాజస్థాన్


 

ఆఫ్ రేసులో నిలబడాలంటే రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక సమరం జరిగింది. ఇరు జట్ల ఆఖరి కీలక లీగ్ మ్యాచ్ లో కోల్ కతా భారీ విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. మునుపటి మ్యాచ్ లలో లాగా ఛేజింగ్ చేయాలని భావించిన రాజస్థాన్ మొదట్లోనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ ఓటమితో ఈ సీజన్‌ను ముగించింది. రన్‌రేట్ కారణంగా రాజస్థాన్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68), రాహుల్ త్రిపాఠి(39) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు తీశాడు. కార్తీక్ త్యాగీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131పరుగులే చేసి ఓటమిపాలైంది. జోస్ బట్లర్(35), రాహుల్ తెవాటియా(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రాబిన్ ఊతప్ప(6), బెన్ స్టోక్స్(18), స్మిత్ (4), సంజూ శాంసన్ (1), రియాన్ పరాగ్ (0) దారుణంగా విఫలమవ్వడంతో రాజస్థాన్ 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జోస్ బట్లర్(35), రాహుల్ తెవాటియా 6వ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. రన్ రేట్ తగ్గిపోతున్న సమయంలో భారీ షాట్ ఆడిన బట్లర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి ఔటవ్వడంతో కోల్‌కతా విజయం లాంఛనమైంది. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. శివం మావి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు. నాగర్ కోటికి ఒక వికెట్ దక్కింది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై కోల్ కతా టోర్నీలో ఉంటుందా లేదా అన్నది తెలుస్తుంది. ప్యాట్ కమిన్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.