తిరుమలలో విద్యుత్ బస్సు ట్రైల్ రన్ సక్సెస్


 

ప్రతి నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దీంతో వాహనాల రాకపోకలు కూడా అధికంగానే ఉంటుంది. ఫలితంగా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దీన్ని నియంత్రించేందుకు అధికారులు నడుం బిగించారు. ఆధ్యాత్మిక నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సరికొత్త వాహనాలను అందుబాటులోకి తెనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తిరుమలలో కాలుష్యరహిత ట్రావెల్ ట్రయల్ రన్ సక్కెస్ ఫుల్‌గా నడుస్తోంది. ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమలలో వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. ఆధ్యాత్మిక నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తెనుంది టీటీడీ. కాలుష్య నియంత్రణ లో భాగంగా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు మధ్య స్మోక్ లెస్ ఎలక్ట్రికల్ బస్సులను ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆర్టీసీ అధికారులు రెండో రోజు పరిశీలించారు. ఆర్టీసీ కేంద్ర విభాగం ఆదేశాల మేరకు ఈ ఎలక్ట్రికల్ బస్సును గత రెండు రోజులగా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ ల మధ్య నడుపుతున్నారు. తిరుమలలో విద్యుత్‌ బస్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ ఫుల్‌గా జరుగుతోంది. రెండో రోజు నిర్వహించిన ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్‌ రన్‌ కొనసాగుతుంది. ఎత్తైన కొండల నడుమ మెట్ట ప్రాంతాలలో ఈ వాహనాల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మక పరిశీలన చేస్తున్నామని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు. ఈ ప్రయోగాత్మక పరిశీలన విజయవంతంగా పూర్తి చేసి,.. భవిష్యత్తులో మరిన్ని వాహనాలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో బస్సులను ఆధునీకరించి ప్రత్యేకంగా రూపొందించారని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తిరుమల-తిరుపతి మధ్య నడుపుతున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ట్రయిల్ రన్ విజయవంతమైనట్లయితే త్వరలో తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు మధ్య డీజిల్ బస్సులు పొగలు చిమ్ముతూ కాలుష్యానికి కారణమవుతున్న పాత తరం బస్సులకు స్వస్తి పలికి, పొగ లేని బస్సులలో ప్రయాణిచేందుకు వీలుంటుందన్నారు.