ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త


 

తెలంగాణ ఆర్టీసీ పై సీఎం కేసీఆర్ ఆదివారం రోజున ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. కరోనా కారణంగా ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు 50 శాతం మేర కోత విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మొత్తాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించనున్నట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసారు. అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగుల భద్రతపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిపారు. ఆర్టీసీ ఇటీవల ప్రారంభించిన పార్సిల్ సర్వీసులు బిజినెస్ 1 మిలియన్ కు చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారులను అభినందించారు. కాగా కరోనా అన్ లాక్ ప్రక్రియలో భాగంగా అయిప్పటివరకు 25 శాతం బస్సులను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇకపై నగరవ్యాప్తంగా 50 శాతం బస్సులను నడిపేందుకు బస్సులను పునరుద్దరించే విధంగా ఆర్టీసీ ఎండి సునీల్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. తాజా ప్రకటనతో ఆర్టీసీ ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది.