గ్యాడ్జెట్స్ బాగా వాడుతున్న వారు గజిని లు

 


పదేపదే ప్రతి చిన్న విషయాన్ని మరిచిపోతున్నారా? ఎంత గుర్తు పెట్టుకోవాలనుకున్నా మీరు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మరిచిపోతున్నారా? ఏమిటీ మతిమరుపు? ఇవేమైనా అల్జీమర్స్ లక్షణాలా అని ఆలోచిస్తున్నారా? డోన్ట్ వర్రీ. ఇదంతా మీరు చేస్తున్న మల్టీ టాస్కింగ్ వల్ల కావచ్చు. కాబట్టి కూల్ డౌన్.. ప్రశాంతంగా ఒక్కొక్క పని చక్కబెట్టే పాత అలవాటు జ్ఞాపకం తెచ్చుకుని అలా చేస్తూపోతే సరి. సింపుల్ కదా. ఇంతకీ మీలో ఈ గజినీ లక్షణాలు ఎలా వచ్చాయనే కదా మీ అనుమానం. అతిగా ఏం చేసినా దానికి దుష్పరిణామాలు వెంటనే వస్తాయని మనందరికీ తెలిసినదే కదా ఇది కూడా అలాంటి కోవకు చెందినదే. మీరు ఏదో పనిలో ఉంటూనే ఈ ఆర్టికల్ చదువుతున్నారనుకోండి ఏమవుతుంది? ఇటీవలే వెలువడ్డ శాస్త్రీయ పరిశోధన మీలాంటి వారిపైనే జరిపారు. మీడియా మల్టీటాస్కింగ్ అంటే నాకు కొట్టిన పిండి, నేను తోపు అని భావించేవారు తరచూ మతిమరుపుతో బాధపడుతున్నారట. వీరికి క్రమంగా జ్ఞాపకశక్తి కూడా తగ్గుతోందట. ఆసక్తికరంగా ఉన్న రీసెర్చ్ పేపర్, ఆ వివరాలు జర్నల్ నేచర్ లో పబ్లిష్ అయ్యాయి. ఎక్కువ స్క్రీన్లను తెరుచుకుని పనిచేసే యువతలో మతిమరుపు సర్వసాధారణం. డిజిటల్ డివైజులు అతిగా వాడుతున్న వీరు ఏపనిమీదా పూర్తిగా ధ్యాస పెట్టలేక, ఏదో టెన్షన్ లో తరచూ పరధ్యానంలో మునిగిపోతారు. దీంతో ఏకాగ్రత లోపిస్తుంది, చేస్తున్న పని, చదువుతున్న విషయంపై అసంపూర్తిగా ఫోకస్ పెట్టడం అసలు విషయాలు మరిచిపోవడం షరామామూలుగా మారిపోతుంది. అసలు ఓ వ్యక్తికి ఉన్న జ్ఞాపకశక్తి ఎంత, ఎంతమేర తాను విషయాలను గుర్తుకు తెచ్చుకోగలడు అన్న విషయంపై జరిగిన అధ్యయనంలో మీడియా మల్టీ టాస్కింగ్ ) చేసేవారు రొటీన్ గా చాలా విషయాలను ఇట్టే మరిచిపోతారని తేలింది. మన మెదడులో చురుకుతనాన్ని నమోదు చేసే రేఖాచిత్రం అనే మెడికల్ టెక్నిక్ ద్వారా వీరిలో ఉన్న జ్ఞాపకశక్తి, విషయాలపై వీరికున్న దృష్టిని విశ్లేషిస్తే మతిమరుపుకు అసలు లింక్ దొరికింది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 80 మంది యువతీ యువకుల డిజిటల్ మీడియా అలవాట్లను లోతుగా పరిశీలించారు. 18-26 ఏళ్ల మధ్య వయస్కులైన వీరిలో అత్యధికుల్లో వీరి బుర్ర, కంటి చూపుకు మధ్య ఉన్న అనుసంధానం ఏస్థాయిలో ఉందో విశ్లేషిస్తే ఎక్కువ మీడియా మల్టీ టాస్కింగ్ చేసినవారు సులువుగా చాలా విషయాలు మరిచిపోతున్నట్టు గుర్తించారు. వీరు తాము చూసిన వస్తువులు, విషయాలను సరిగ్గా గుర్తుంచుకోలేక, గుర్తుకు తెచ్చుకోలేక ఇబ్బంది పడ్డారు. మీడియా మల్టీ టాస్కింగ్ గరిష్ఠంగా చేసినవారిలో జ్ఞాపకశక్తి అత్యల్పంగా ఉందని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్ మెంట్ కు చెందిన కెవిన్ మడోర్ సైంటిఫిక్ అమెరికన్ కు వివరించా WhatsApp Shopping: వాట్సప్‌లో షాపింగ్ చేయొచ్చు... కొత్త ఫీచర్చ్సింంంంంం ఇదేదో మొట్టమొదటిసారి వెలుగులోకి వచ్చిన విషయం కానేకాదు. గతంలోనూ మనుషుల జ్ఞాపకశక్తికి డిజిటల్ గ్యాడ్జెట్లకు ఉన్న సంబంధంపై అధ్యయనం చేసినప్పుడల్లా వెలుగులోకి వచ్చింది ఈ విషయమే. అందుకే డిజిటల్ మీడియా వినియోగం పెరిగేకొద్దీ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్-ADHD లక్షణాలు పెరుగుతాయని గత పరిశోధనల్లోనూ తేలింది. 2018లో లాస్ ఏంజిలెస్ ప్రాంతంలోని 10 స్కూళ్లకు చెందిన 3,000 మంది విద్యార్థులపై డాక్టర్ యాడం లెవెంథాల్ చేసిన అధ్యయనంలో డిజిటల్ గ్యాడ్జెట్లకు బానిసలైన పిల్లల మెదడుపై ఇవి దుష్ప్రభావాలు చూపుతున్నట్టు తేలింది. ఏడీహెచ్ డీ రేటు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగింది. కోవిడ్ కారణంగా పిల్లలు డిజిటల్ మీడియాపై అత్యధికంగా ఆధారపడుతున్న క్రమంలో ఎదిగే పిల్లల మెదడుపై డిజిటల్ మీడియా ప్రభావాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ కారణంగా మెదడును ఉత్తేజపరిచే మందులను చిన్న వయసులో ఉపయోగించాల్సిన అవసరం వస్తోందని వైద్యులు వాపోతున్నారు. క్రమంగా ఇవన్నీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కనుక ఏడీహెచ్ డీ ని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైంది.