పాలకూర పోషకాల గని.

 


పాలకూర పోషకాల గని. దీని లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి12 , ఫోలిక్ ఆసిడ్, మాంగనీస్,మెగ్నీషియం మరియు ఇనుము వున్నాయి. ముఖ్యంగా 'విటమిన్ కే' పాలకూర లో వున్నంతగా మరే కూరలోను లభించదు. ఎముకల ఆరోగ్య పరికరక్షణ దీని పాత్ర అమోహం. శరీరంలోని అన్ని భాగాలకి రక్తం సరఫరా చేసే ఎర్ర రక్తకణాల పని తీరుకి ఇనుము ఎంతో అవసరం. పాలకూరలో ఇనుము కూడా ఎక్కువే. పాలకూర లో ఫోలేట్, అమినో ఆసిడ్ ఎక్కువ, రక్తం లో 'హుమేసిస్టన్' మోతాదు ని నియంత్రించి సన్నని రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకుల్ని తగ్గిస్తుంది. గుండె, కంటి చూపు నే కాకుండా శృంగార పరమైన విషయంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. పాలకూరను ప్రతిదినం ఆహారంగా తెలుకోవటం ద్వారా, పక్షవాతం, వయసు పెరగటం తో వచ్చే మతిమరుపు, ఇంకా అనేక రకాల కాన్సర్ లు రాకుండా కాపాడుతుంది. పాలకూరలో వున్న విటమిన్ ఏ, బీటా కెరాటిన్ లు వయసుతో పాటు వచ్చే చర్మ ముడతలు తగ్గిస్తూ, చర్మం కాంతి వంతం గా వుండేటట్లు చేస్తావి.