ఇంధన ఎగుమతి విధానం (ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ) ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం


 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన ఇంధన ఎగుమతి విధానం (ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ) కోసం లక్ష ఎకరాలను గుర్తించగా పవన, సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థలకు వీటిని ఇవ్వనున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇందుకు అపార అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పి విద్యుత్‌ను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునేందుకు ఎక్స్‌పోర్ట్‌ పాలసీ వీలు కల్పిస్తుంది. ఈ విధానం కింద ముందుకొచ్చే సంస్థలకు సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌కాప్‌) మౌలిక వసతులు కల్పిస్తోంది. లీజుకు భూమి సోలార్, విండ్‌ ప్లాంట్లు నెలకొల్పే సంస్థలకు ప్రభుత్వమే భూమి సమకూరుస్తుంది.