వాట్సాప్ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు


 

WhatsApp Payment Service : వాట్సాప్ వినియోగదారులకుపెద్ద గుడ్ న్యూస్. ఇక ముందు వాట్సాప్ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి వచ్చిన విషయంను ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ ఈ ప్రకటించారు. వాట్సాప్‌లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. దీంతో నేటి నుంచి వాట్సప్‌లో సురక్షితంగా పేమెంట్స్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ అవకాశాన్ని వాట్సప్ వినియోగదారులందరికీ డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. వాట్సప్ ద్వారా చేసే చెల్లింపులకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ తన పేమెంట్‌ సర్వీసును దేశీయంగా ప్రారంభించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ( NPCI) గురువారం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గ్రేడెడ్‌ విధానంలో వాట్సాప్‌ తన సర్వీసులను ప్రారంభించనుంది. వాట్సాప్‌ గత రెండేళ్లుగా తన యూపీఐ ఆధారిత పేమెంట్‌ పైలెట్‌ సర్వీసును నడుపుతోంది. కానీ డేటా లోకలైజేషన్‌ అవసరాల కారణంగా అధికారికంగా అనుమతి లభించలేదు. తాజాగా ఎన్‌పీసీఐ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.