చివరికి చేరిన ఐపీఎల్ నేడు హైదరాబాద్ ఢిల్లీ డీ తాడోపేడో తేల్చుకుందాం

 ఐపీఎల్‌ 2020 పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఎలాగైనా ఈసారి టైటిల్‌ కొట్టాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతుంటే...మరోసారి ఛాంపియన్స్‌గా నిలవాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌


ఎదురుచూస్తుంది. ఈ తరుణంలో ఢిల్లీ కాపిటల్స్‌, సన్స్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య ఇవాళ అసలైన ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్‌ లో గెలవాలని ఇరుజట్లు నెట్స్‌లో చాలా కష్టపడుతున్నాయి. ఢిల్లీని ఓడించడానికి రషీద్‌ ఖాన్‌ మంచి ప్లాన్లు కూడా వేస్తున్నాడని సమాచారం. ఈ మ్యాచ్‌ అబుదాబిలో జరుగుతుంది. ఈ పిచ్‌పై సన్‌ రైజర్స్‌ ఈజీగా విజయం సాధిస్తుందని క్రికెట్‌ ప్రముఖులు అంటున్నారు. మరోవైపు మేము తక్కువేం కాదని సన్‌ రైజర్స్‌ ను ఓడించి..ఫైనల్‌లోనూ టైటిల్‌ గెలుస్తామని ఢిల్లీ ఆత్మవిశ్వాసంగా ఉంది. ఇవాళ జరిగే మ్యాచ్‌ ఇరు జట్లకు డూ ఆర్‌ డై అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి దారి పట్టాల్సిందే. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ముందుగా బౌలింగ్‌ చేసిన జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం.