స్పెషల్ రోల్లో నాని


 

టాక్సీవాలా " ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో "శ్యామ్ సింగ రాయ్ "మూవీ తెరకెక్కనుంది. డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో ముగ్గురు కథానాయిక లలో ఇప్పటి వరకూ సాయి పల్లవి , కృతి శెట్టి ఎంపిక అయ్యారు. "శ్యామ్ సింగ రాయ్ "మూవీ లో హీరో నాని ఫిల్మ్ డైరెక్టర్ గా నటించనున్నారని సమాచారం. హీరో నాని రియల్ లైఫ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ కావాలనే నాని కల రీల్ లైఫ్ లో "శ్యామ్ సింగ రాయ్ "మూవీ ద్వారా నెరవేరనుంది.