మీ శానిటైజర్ నాణ్యత మైనదో కాదా తెలుసుకోండి


 

కరోనా మహమ్మారి ప్రభావంతో హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కుల వాడకం మన జీవితంలో భాగమైంది. నీరు, సబ్బు అందుబాటులో లేనప్పుడు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్‌నే అనేక మంది ప్రత్యామ్నాయంగా ఉపయోగి స్తున్నారు. ప్రయాణాలు చేసిన సమయం లోనూ శానిటైజర్‌ను వెంట తీసుకెళ్తున్నారు. వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు ఈ హ్యాండ్‌ శానిటైజర్లు ఎంతగానో ఉపకరిస్తు న్నాయి. అయితే వీటికి పెరుగుతున్న డిమాండ్‌ కొద్దీ మార్కెట్లో కొందరు ఫేక్‌ శానిటైజర్లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఇలాంటి శానిటైజర్లను వాడే వారు కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా వీటిని వాడడం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. ఈ నేపథ్యంలో శానిటైజర్‌ నాణ్యతను తెలుసుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలు ఇవే.. - టిష్యూ పేపర్‌ను తీసుకొని దానిపై బాల్‌ పాయింట్‌ పెన్నుతో ఓ వృత్తం గీయండి. అనంతరం ఈ కాగితాన్ని చదునైన ఉపరితలంపై ఉంచండి. శానిటైజర్‌ తీసుకుని టిష్యూ పేపర్‌పై ఉన్న వృత్తంలో కొన్ని చుక్కలను పోయండి. ఇప్పుడు వృత్తం నుంచి బయటకు వెళ్లే వరకు వేచి ఉండండి. జెల్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ వ్యాప్తి చెందడానికి సమయం పడుతుంది. ద్రవ రూపంలో ఉన్న శానిటైజర్‌లో తగినంత ఆల్కహాల్‌ ఉండి, ప్రభావావంతంగా పనిచేస్తుంటే మీరు గీసిన గీత దానిలో కరిగిపోతుంది. రంగు విస్తరించడం ప్రారంభమవుతుంది. నకిలీదైనట్లయితే అది సిరాను కరిగించకుండా రేఖను దాటి వ్యాప్తి చెందుతుంది. పేపర్‌ క్రోమాటోగ్రఫీ సూత్రం ప్రకారం బాల్‌ పాయింట్‌ పెన్నులో ఉండే సిరా నీటిలో కరగదు. అయితే ఆల్కహాల్లో కరిగి సిరా వ్యాప్తికి దారితీస్తుంది. ఈ లిక్విడ్‌లో ఆల్కాహాల్‌ కంటెంట్‌ సిరాలో కరిగించదు. - ఓ చిన్న గిన్నె తీసుకొని టేబుల్‌ స్పూన్‌ గోధుమ పిండి లేదా వేరే ఇతర పిండిలో శానిటైజర్‌ను కలపండి. ఆ మిశ్రమాన్ని మెత్తగా కలిపేందుకు ప్రయత్నించండి. పిండి మెత్తగా అయితే ఆ శానిటైజర్‌లో తగినంత ఆల్కహాల్‌ లేదని తెలుసు కోవాలి. ఒరిజినల్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ను పిండిని అంటుకునేలా చేయదు. పిండిలో కరిగిన వెంటనే అది ఎండిపోతుంది. శాని టైజర్‌లో కనీసం 60శాతం ఆల్కహాల్‌ ఉందో లేదో తెలుసుకు నేందుకు ఇది అత్యంత ప్రభావంతమైన పరీక్ష. ముఖ్యంగా పిండిగా మారడానికి తగినంత నీరు అవసరం. గ్లూటెన్‌, పిండిపదార్థాలు ఉబ్బి అంటుకునేలా చేస్తాయి. రెండు చిన్న గిన్నెలు తీసుకోండి. ఓ గిన్నె తీసుకుని అందులో ఓ టేబుల్‌ స్పూన్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ వేయండి. రెండవ దానిలో కొంచెం నీరు పోయండి. అనంతరం హెయిర్‌ డ్రయర్‌ను వేడిచేయండి. అదే ఉష్ణోగ్రత వద్ద రెండు గిన్నెల్లో ద్రవాన్ని డ్రయర్‌ సాయంతో ఆరిపోయేటట్లు చేయండి. హ్యాండ్‌ శానిటైజర్‌లో తగినంత ఆల్కాహాల్‌ ఉన్నట్లయితే అది నీటి కంటే తక్కువ బాయిలింగ్‌ పాయింట్‌ వద్ద ఉంటుంది కాబట్టి వేగంగా ఎండిపోతుంది