రోహిత్ స్థానంలో అయ్యార్

 


న్యూఢిల్లీ: గాయాలతో సతమతమవుతున్న టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ , బౌలర్‌ ఇషాంత్‌ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఫిట్‌నెస్‌పై ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వరుసగా డబుల్‌ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ గనుక గాయం కారణంగా జట్టుకు దూరమైతే టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.