మర్డర్ సినిమాకి లైన్ క్లియర్ చేసిన హైకోర్టు


 

కాంట్రవర్సీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వర్మ.. ప్రస్తుతం పలు చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మర్డర్, దిశా ఎన్‌కౌంటర్ చిత్రాలు వార్తలలో నిలుస్తూ వస్తున్నాయి. మర్డర్ చిత్రం మిర్యాలగూడలో జరిగిన పరువుహత్య నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఈ సినిమా విడుదల ఆపేయాలని నల్గొండ కోర్టు గతంలో స్టే ఇచ్చింది. తమ అనుమతి లేకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని అమృత కోర్టుని ఆశ్రయించడంతో వారు సినిమాని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించగా, శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సినిమాలో ప్రణయ్‌, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. ఇందుకు చిత్ర బృందం సరే అని చెప్పడంతో సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. మా మంచి ఉద్దేశాన్ని కోర్టు అర్దం చేసుకుంది. కోర్టు ఆర్డర్ వచ్చాక అన్ని విషయాలు వెల్లడిస్తా అని ఆర్జీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు