కేదార్ నాథ్ లో ఘనంగా దీపావళి వేడుకలు


 

కేదార్‌నాథ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గడ్డకట్టించే చలిలోనూ భక్తల 'హర హర మహాదేవ' నినాదాలు ఆలయ ప్రాంగణంలో మారుమోగుతున్నాయి. భక్తుల భజనలతో కోలాహలం నెలకొంది. దీపావళి సందర్భంగా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కేదార్‌నాథ్‌కు తరలివస్తున్నారు. పండుగ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గడ్డకట్టించే చలి, అధికంగా కురుస్తున్న మంచు కారణంగా నవంబరు 16 నుంచి కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇంతలోనే మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు కేదార్‌నాథ్ ఆలయానికి తరలివస్తున్నారు.