ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు


నిరుద్యోగులకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Short Service Commission in Remount Veterinary Corps పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ చర్యలు చేపట్టింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు joinindianarmy.nic.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన లింక్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు ఏదైనా లేదా persvet - 1779@nic.in మెయిల్ కు సైతం సందేహాలను పంపించి నివృత్తి చేసుకోవచ్చు. Official Website దరఖాస్తులను పంపించడానికి డిసెంబర్ 10ని ఆఖరి తేదీగా అధికారులు నిర్ణయించారు. BVSc/BVS&AH డిగ్రీని పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 10 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నింపే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ ను జాగ్రత్తగా చదవాలని నిర్వాహకులు సూచించారు. 21 నుంచి 32 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.