పబ్జి లాంటి కొత్త గేమ్

 


ఓరి ఈ పబ్జీని తగలెయ్య. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే.. దాని మంచి గురించి ఎక్కువ సేపు మాట్లాడుకోలేం కాబట్టి. సీరియల్స్ పిచ్చోళ్లైనా చెబితే వింటారేమో కానీ.. పబ్ జీ పిచ్చోళ్లు విననే వినలే. మొత్తానికి బ్యాన్ చేసి.. ఫ్యాన్స్ ని పిచ్చోళ్లని చేశారు. వాళ్ల ఆకలి తీర్చే కొత్త కొత్త యాప్ లు చాలా వచ్చినా.. ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త గేమ్ రెడీగా ఉంది.అవును. ఈసారి వచ్చే యాప్.. ఎగరేసి తంతే పోయేదిలా కాకుండా.. మూన్నాళ్ల ముచ్చటలా కాకుండా ఉంటుంది.కొత్తగా వస్తున్న మొబైల్ గేమ్ యాప్ పేరు. ఫౌజీ. ఇది మామూలు అల్లాటప్పా గేమ్ కాదు. ప్రతి ఒక్కరిలో దేశ భక్తి రగిల్చే గేమ్. దేశం మీద ఉన్న ప్రేమను ఇంకా పెంచే గేమ్. బోర్డర్ లో మన మిలిటరీ వాళ్లు చేస్తున్న ప్రాణ త్యాగాల్ని.. అక్కడి హోరా హోరీ పోరాటాల్ని చూపించే గేమ్ యాపే.. ఫౌజీ. బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్ దీనికి సపోర్టింగ్ గా ఉన్నారు. తనే ప్రమోట్ చేస్తున్నారు. ఈ గేమ్ కి సంబంధించిన టీజర్ ను కూడా సినిమా టీజర్ లాగే రిలీజ్ చేశారు. ఇక అన్నీ రెడీ అయ్యాయి. విడుదలకు రెడీ అవుతుంది. పబ్ జీ మొబైల్ ఇండియా యాప్ గా దీన్ని తీసుకురాబోతున్నారు.ఫౌజీ గేమ్ డిసెంబర్ లో రిలీజ్ చేస్తారు అనే విషయం పై క్లారిటీ ఉంది కానీ.. డేట్ విషయంలో కన్ఫర్మేషన్ లేదు. గూగుల్ ప్లే స్టోర్ తో పాటు.. యాపిల్ యాప్ స్టోర్ లో కూడా ఫౌజీ గేమ్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇంకెంతో టైం పట్టదు. మ్యాగ్జిమమ్ ఈ ట్వంటీ ట్వంటీలోనే ఫౌజీ గేమ్ రిలీజ్ చేస్తారట.