దీపావళికి విడుదల కానున్న సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు సినిమా

 


కరోనా కారణంగా మూతపడిపోయిన థియేటర్స్ ని రీ ఓపెన్ చేసుకోడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీపావళి నుంచి థియేటర్స్ లో సినిమాల ప్రదర్శించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా మహేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తమిళ్ లో మహేష్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ''ఇవణ్ణుకు సరియానా అలిల్లై'' పేరుతో అనువందించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ ఓపెన్ చేస్తే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే మాస్ సినిమాలు ఏవీ ప్రస్తుతానికి రెడీగా లేవు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో నటించిన 'ఇవణ్ణుకు సరియానా అలిల్లై' వంటి సినిమాని థియేటర్స్ లోకి తీసుకొస్తే థియేటర్స్ కు ఆడియెన్స్ వస్తారనే ఆలోచన చేస్తున్నారట. మహేష్ బాబు కు తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది. మహేష్ సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా తమిళంలోకి డబ్ చేస్తుంటారు. 'స్పైడర్' అనే డైరెక్ట్ తమిళ్ మూవీ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మాస్ ప్రేక్షకులను ఆకర్షించాడని మహేష్ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా విజయశాంతి - ప్రకాష్ రాజ్ - రాజేంద్ర ప్రసాద్ - సంగీత - వెన్నెల కిషోర్ - సత్యదేవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.